ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి
Movie | : Andala Rakshasi |
Lyrics | : Rakendu Mouli |
Music | : Rathan |
Singer | : Haricharan |

Yemito Song Andala Rakshasi Movie (2012) | telugu lyrics
శపించెనే నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇకపై నా జీవితం
శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే
ఆగనీ ప్రయాణమై
యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా
తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా…
నువ్వే లేని నేనులేనుగా లేనేలేనుగా…
లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి
తడిసిందిలే నాలో ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా
గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ
మారకే నిశ్వాసలా
నీకే న్యాయమా నన్నే మార్చి
ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనె నిండిపోకలా నిజంలోకి రా
కలలతోనే కాలయాపన
నిజాల జాడ నీవే అంటూ మెలకువై కలే చూపే
ఏం మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె
ఏం చెయ్యనూ నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే
Yemito Song Andala Rakshasi Movie (2012) | lyrical video
watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs
Pingback: Meghama Maruvake Song in Telugu from Seetharatnam Gari Abbayi Movie|telugu lyrics LyricsMp3Songs