తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచే

Movie   :  Sontham
Lyrics  :  Sirivennela
Music  :  Devi Sri Prasad
Singer :  Chitra
Telusuna Telusuna Song Lyrics Sontham(2002)|telugu lyrics

Telusuna Telusuna Song Lyrics Sontham(2002)|telugu lyrics

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక

అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక

నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక

ఎలా ఎలా దాచి ఉంచేది

ఎలా ఎలా దాన్ని ఆపేది

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక

అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది

పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది

కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు

ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో

కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక

అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగిందే

తడిమి చూస్తే అతడి తలపే నిండి పొయిందే

నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు

గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే

అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక

అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక

నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక

ఎలా ఎలా దాచి ఉంచేది

ఎలా ఎలా దాన్ని ఆపేది

కలవనా కలవనా నేస్తమా అలవాటుగా

పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా

Telusuna Telusuna Song Lyrics Sontham(2002)|lyrical video

watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs

1 thought on “Telusuna Telusuna Song Lyrics Sontham(2002)|telugu lyrics”

  1. Pingback: Manohara Na Hrudayamune Song Lyrics Cheli Movie (2001)|telugu lyrics LyricsMp3Songs

Leave a Reply

Your email address will not be published.