పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేష

Movie :  Nuvvu Vastavani 
Lyrics   :  Sirivennela 
Music    :  S A Rajkumar 
Singer  :  S P Balu
Patala Pallakivai Song  Nuvvu Vastavani Movie (2000)| telugu lyrics

Patala Pallakivai Song  Nuvvu Vastavani Movie (2000)| telugu lyrics

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి

కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి

నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే

నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే

నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి ||పాటల||

నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది

తనరూపు తానెపుడూ చూపించలేనంది

అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి

ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి

రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలోకిస్తుంది

రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది

ఆ కలక జాడ కళ్ళు ఎవరినడగాలి|| పాటల||

పాదాల్ని నడిపించేప్రాణాల రూపేది

ఊహల్ని కదిలించే భావాల ఉనికేది

వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా

కోయిల గానమా నీ గుటిని చూపుమా

ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది

తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది

ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది || పాటల | 

Patala Pallakivai Song  Nuvvu Vastavani Movie (2000)| lyrical video

watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs

Leave a Reply

Your email address will not be published.