మువ్వలా నవ్వకలా… ముద్దమందారమా మువ్వలా నవ్వకలా… ముద్దమందారమా ముగ్గులో దించకిలా… ముగ్ధ సింగారమా నేలకే నాట్యం నేర్పావే… నయగారమా గాలికే

Movie :  Pournami
Lyrics    :  Sirivennela
Music :  Devi Sri Prasad
Singers  :  S P Balu, Chitra
Muvvala Navvakala Song Lyrics Pournami Movie (2006)|telugu lyrics

Muvvala navvakala song lyrics pournami movie (2006)|telugu lyrics

మువ్వలా నవ్వకలా… ముద్దమందారమా

మువ్వలా నవ్వకలా… ముద్దమందారమా

ముగ్గులో దించకిలా… ముగ్ధ సింగారమా

నేలకే నాట్యం నేర్పావే… నయగారమా

గాలికే సంకెళ్లేశావే… ఏ…ఏ…

నన్నిలా మార్చగల కళ నీ సొంతమా…

ఇది నీ మాయ వల కాదని అనకుమా…

ఆశకే ఆయువు పోశావే… మధుమంత్రమా…

రేయికే రంగులు పూశావే…ఏ..ఏ..

కలిసిన పరిచయం ఒకరోజే కదా…

కలిగిన పరవశం… యుగముల నాటిదా..

కళ్లతో చూసే నిజం నిజం కాదేమో..

గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో…

ఓ…ఓ…ఓ…ఓ…

నన్నిలా మార్చగల కళ నీ సొంతమా..

ఇది నీ మాయవల కాదని అనకుమా…

నేలకే నాట్యం నేర్పావే… నయగారమా

గాలికే సంకెళ్లేశావే…ఏ…ఏ…

పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ..

మరియొక జన్మగా మొదలౌతున్నదా…

పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా…

మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా…

ఓ…ఓ…ఓ…ఓ…

మువ్వలా నవ్వకలా… ముద్దమందారమా

ముగ్గులో దించకిలా… ముగ్ధ సింగారమా

ఆశకే ఆయువు పోశావే… మధుమంత్రమా

రేయికే రంగులు పూశావే..ఏ…ఏ..

Muvvala Navvakala Song Lyrics Pournami Movie (2006)|lyrical video

watch this video in youtube For more lyrical song visit lyricsmp3songs

Leave a Reply

Your email address will not be published.