మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త

Movie    :  Naa Autograph
Lyrics:  Chandrabose
Music  :  M M Keeravani
Singer :  Chitra
Mounamgane Song Lyrics Naa Autograph Movie (2004)|telugu lyrics

Mounamgane Song Lyrics Naa Autograph Movie (2004)|telugu lyrics

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది

ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది

ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా

దరికి చేర్చు దారులు కూడ ఉన్నాయిగా

భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా

బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా

సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది

విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది

అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది

కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది

తెలుసుకుంటె సత్యమిది

తలచుకుంటె సాధ్యమిది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో

మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో

పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో

మారిపోని కధలే లేవని గమనించుకో

తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు

నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి

నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా

నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా

నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి

అంతులేని చరితలకి ఆది నువ్వు కావాల

Mounamgane Song Lyrics Naa Autograph Movie (2004)|lyrical video

watch this video in youtube

Leave a Reply

Your email address will not be published.