మనసున ఉన్నదీ చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బైటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా Manasuna Unnadi Song

Movie   :  Priyamaina Neeku
Lyrics   :  Sirivennela
Music   :  S A Rajkumar
Singer   :  Chitra

Manasuna Unnadi Song Lyrics

మనసున ఉన్నదీ చెప్పాలనున్నది

మాటలు రావే ఎలా

మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి

బైటికి రాదే ఎలా

అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే

బిడియం ఆపేదెలా

ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే

తలపులు చూపేదెలా

ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో

తెలపక పోతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది

మాటలు రావే ఎలా

ల ల ల లా…. ల ల ల ల ల ల లా…..

ల ల ల లా…. ల ల ల ల ల ల లా…..

చింత నిప్పైన చల్లగ ఉందని

ఎంత నొప్పైన తెలియలేదని

తననే తలుచుకునే వేడిలో

ప్రేమ అంటేనె తియ్యని బాధని

లేత గుండెల్లొ కొండంత బరువని

కొత్తగా తెలుసుకునే వేళలో

కనబడుతోందా నా ప్రియమైన నీకు

నా ఎద కోత అని అడగాలనీ

అనుకుంటు తన చుట్టూ మరి తిరిగిందనీ

తెలపక పోతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది

మాటలు రావే ఎలా

నీలి కన్నుల్లొ అతని బొమ్మని

చూసి నాకింక చోటెక్కడుందని

నిదరే కసురుకునే రేయిలో

మేలుకున్నా ఇదేం వింత కైపని

వేల ఊహల్లొ ఊరేగు చూపుని

కలలే ముసురుకునే హాయిలో

వినబడుతోందా నా ప్రియమైన నీకు

ఆశల రాగం అని అడగాలనీ

పగలేదో రేయేదో గురుతే లేదనీ

తెలపక పోతే ఎలా

మనసున ఉన్నదీ చెప్పాలనున్నది

మాటలు రావే ఎలా

మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి

బైటికి రాదే ఎలా

అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే

బిడియం ఆపేదెలా

ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే

తలపులు చూపేదెలా

ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో

తెలపక పోతే ఎలా… ఆ…..

ల ల లా.. ల ల ల ల

ల ల ల ల లా లా…

ల ల లా.. ల ల ల ల

ల ల ల ల లా లా…

Manasuna Unnadi Song Lyrical Video

Watch This Video In Youtube Read More Telugu Lyrics Post From Lyricsmp3songs.com

1 thought on “Manasuna Unnadi Song Lyrics Priyamaina Neeku Movie (2001)”

  1. Pingback: Nuvvu Nuvvu Song Lyrics Khadgam Movie (2002) - LyricsMp3Songs

Leave a Reply

Your email address will not be published.