ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ.. ఇదేం అల్లరీ నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే.. ఇదేం గారడీ నేను కూడా నువ్వయానా.. పేరు కైనా న

Movie  :  Nuvve Kavali
Lyrics :  Sirivennela
Music  :  Koti
Singers:  Gopika Purnima, Sreeram
Ekkada Vunna Song Lyrics Nuvve Kavali(2000)|telugu lyrics

Ekkada Vunna Song Lyrics Nuvve Kavali(2000)|telugu lyrics

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది

చెలీ.. ఇదేం అల్లరీ

నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది

అరే.. ఇదేం గారడీ

నేను కూడా నువ్వయానా..

పేరు కైనా నేను లేనా..

దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..

ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది

చెలీ.. ఇదేం అల్లరీ

నిద్దుర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది

నువ్వే.. కదా.. చెప్పు ఆ పరిమళం

వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది

నీదే.. కాదా.. చెప్పు ఆ సంబరం

కనుల ఎదుట నువు లేకున్నా

మనసు నమ్మదే చెబుతున్నా

ఎవరు ఎవరితో ఎమన్నా

నువ్వు పిలిచినట్టనుకున్నా

ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా

ఏమిటవుతుందో ఇలా నా ఎద మాటునా…

ఓ… దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది

చెలీ.. ఇదేం అల్లరీ

నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది

అరే.. ఇదేం గారడీ

నేను కూడా నువ్వయానా..

పేరు కైనా నేను లేనా..

దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..

ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..

కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది

నువ్వూ.. అలా.. వస్తూ ఉంటావనీ

గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది

చెలీ.. నీకై.. చూస్తూ ఉంటాననీ

మనసు మునుపు ఎపుడూ ఇంత

ఉలికి ఉలికి పడలేదు కదా

మనకు తెలియనిది ఈ వింతా

ఎవరి చలవ ఈ గిలిగింత

నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా

ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా…

ఓ… దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది

చెలీ.. ఇదేం అల్లరీ

నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది

అరే.. ఇదేం గారడీ

నేను కూడా నువ్వయానా..

పేరు కైనా నేను లేనా..

దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..

ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..

Ekkada Vunna Song Lyrics Nuvve Kavali(2000)|lyrical video

watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs

Leave a Reply

Your email address will not be published.