దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని నీ కళ్లలోన ఆ కళ్లు పెంచే రూపాన్ని బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

Movie    :  Dhada
Lyrics    :  Ramajogayya Sastry
Music :  Devi Sri Prasad
Singers :  Kalyan, Andrea
Cast :  Naga Chaitanya, Kajal Agarwal
Diwali Deepaanni Song Dhada Movie (2011) | telugu lyrics

Diwali Deepaanni Song Dhada Movie (2011) | telugu lyrics

చక్కెర చిన్నోడ ఆలే కత్తెర కళ్లోడా ఆలే 

చూడర బుల్లోడా ఆలే అందాన్ని

ఒంటరి పిల్లోడ ఆలే తుంటరి పిల్లోడా ఆలే 

వద్దకు లాగెయ్‌ రా ఆలే వజ్రాన్ని

దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని

నీ కళ్లలోన ఆ కళ్లు పెంచే రూపాన్ని

బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని

ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

చక్కెర చిన్నోడ ఆలే కత్తెర కళ్లోడా ఆలే

చూడర బుల్లోడా ఆలే అందాన్ని

ఊరించే నిషాని ఊపిరిపోసే విషాన్ని

నెత్తురు లోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని

అత్తరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని

అల్లుకుపోరా కాముడు రాసిన గ్రంథాన్ని

చక్కెర చిన్నోడ ఆలే కత్తెర కళ్లోడా ఆలే

చూడర బుల్లోడా ఆలే అందాన్ని

కదిలే నావలా వయసే ఊయల

ఎదటే నువ్వలా గిచ్చే కన్నై చూస్తుంటే

నిజమా ఈ కల అనిపించేంతలా

మనసే గువ్వలా గాల్లో తేలిందే

నీపక్క చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా

నాకే నీలోన చోటిస్తే నన్నే దాచేస్తా

ఓ… నీ గూడు నాకిస్తే ఇందా నా గుండె నీకిస్తా

నీతో వెయ్యేళ్లు రానిస్తే నన్నే రాసిస్తా

దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని

నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని

బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని

ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

ఒకడే వేయిగా కదిలే మాయగా

కనిపించావుగా అటూ ఇటూ నా చుట్టూ

సలసల హాయిగా సరసున రాయిగ

కదిలించావుగా ప్రాయం పొంగేట్టు

పొందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో

ఎటో ఎత్తుకు పోతావో అంతా నీ ఇష్టం

ఉప్పెన తెస్తావో నొప్పిని ఉఫ్ఫనిపిస్తావో

తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం

దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని

నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని

బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని

ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

Diwali Deepaanni Song Dhada Movie (2011) | lyrical video

watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs

1 thought on “Diwali Deepaanni Song Dhada Movie (2011) | telugu lyrics”

  1. Pingback: Devudu Karunisthadani Song  Prema Katha Movie (1999)| telugu lyrics LyricsMp3Songs

Leave a Reply

Your email address will not be published.