Telugu lyrics for amma amma song . అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరౌతోంది ఎదలో గాయం అయ్యో వెళిపోయావే నన్నొదిలేసి ఎటుపోయావే అమ్మా
Movie | : Raghuvaran Btech |
Lyrics | : Ramajogayya Sastry |
Music | : Anirudh Ravichander |
Singers | : Deepu, S.Janaki |

Amma Amma Song Raghuvaran Btech Movie (2015)| telugu lyrics
అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా
మాటే లేకుండా నువ్వే మాయం
కన్నీరౌతోంది ఎదలో గాయం
అయ్యో వెళిపోయావే
నన్నొదిలేసి ఎటుపోయావే
అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట
నే పాడే జోలకు నువు కన్నెత్తి చూసావో అంతే చాలంటా
అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా
చెరిగింది దీపం కరిగింది రూపం
అమ్మా నాపై ఏమంత కోపం
కొండంత శోకం నేనున్న లోకం
నన్నే చూస్తూ నవ్వింది శూన్యం
నాకే ఎందుకు శాపం
జన్మల గతమే చేసిన పాపం
పగలే దిగులైన నడిరేయి ముసిరింది
కలవరపెడుతోంది పెను చీకటి
ఊపిరి నన్నొదిలి నీలా వెళిపోయింది
బ్రతికి సుఖమేమిటి
అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా
విడలేక నిన్ను విడిపోయి ఉన్నా
కలిసే లేనా నీ శ్వాసలోన
మరణాన్ని మరచి జీవించి ఉన్నా
ఏచోట ఉన్నా నీ థ్యాసలోన
నిజమై నే లేకున్నా
కన్నా నిన్నే కలగంటున్నా
కాలం కలకాలం ఒకలాగే నడిచేనా
కలతను రానీకు కన్నంచున
కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన
చిగురై నిను చేరనా
అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా
నువ్వే లేక పసి వాడానమ్మా
అడుగై నీతోనే నడిచొస్తున్నా
అద్దంలో నువ్వై కనిపిస్తున్నా
అమ్మా వెళ్లిపోయావె
నీలో ప్రాణం నా చిరునవ్వే
అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట
వెన్నంటే చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా…
Amma Amma Song Raghuvaran Btech Movie (2015)| lyrical video
watch this video in youtube .For more lyrical songs visit lyricsmp3songs
Pingback: Prema Prema Song Prema Desam Movie (1996)| telugu lyrics LyricsMp3Songs
Pingback: Sasivadane Song Iddaru Movie (1997)|telugu lyrics LyricsMp3Songs